ఇండియన్స్ ఎందుకు క్లీన్‌గా ఉండరు: నటి
ముంబైలోని జుహు, బ్రెజిల్‌లోని రియో బీచ్‌లను పోల్చుతూ నటి, వ్లాగర్ షెనాజ్ ట్రెజరీ ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది. ‘జుహు కంటే రియో బీచ్ కిక్కిరిసిపోయింది. ఇంతమంది ఉన్నా ఎంత క్లీన్‌గా ఉంది. ఇండియన్స్ ఎందుకు క్లీన్‌గా ఉండరు?’ అని ఓ వీడియో షేర్ చేసింది. ఇండియన్స్‌ను అవమానించారంటూ కొందరు ఫైర్ అవుతున్నారు. ‘తను చెప్పిన దాంట్లో తప్పేముంది. ముందు మనం మారాలి’ అంటూ మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు.
Comments