ఎంఈడీ, ఎంపీఈడీ ప్రవేశాలకు నేటి నుంచి కౌన్సెలింగ్
తెలంగాణ : ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఇవాళ్టి నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ నెల 14 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ , 15, 16 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ నెల 21న సీట్లను కేటాయిస్తామని, 24వ తేదీలోగా కాలేజీలో రిపోర్ట్ చేయాలన్నారు. అటు TGICET నిర్వహించిన స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ ముగిసింది. ఇప్పటివరకు 25,743 MBA, 4,628 MCA సీట్లు భర్తీ అయ్యాయి.
Comments