కోనసీమ దుర్ఘటన.. విచారణకు ఉన్నతస్థాయి కమిటీ
ఆంధ్ర ప్రదేశ్ : కోనసీమ(D) రాయవరంలో బాణసంచా పేలి 8 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తునకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్ నేతృత్వంలో ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. పేలుడుకు గల కారణాలు, బాధ్యులను గుర్తించాలని ఆదేశించింది. విచారణ అధ్యయన నివేదికను వారంలోగా సమర్పించాలని ఆదేశించింది.
Comments