కమిన్స్, హెడ్‌కు రూ.58 కోట్ల ఆఫర్!
ఆసీస్ క్రికెటర్లు కమిన్స్, హెడ్‌కు ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ భారీ మొత్తం ఆఫర్ చేసినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ఆస్ట్రేలియా ను వీడి తమ ఫ్రాంచైజీ తరఫున గ్లోబల్ T20 టోర్నీల్లో ఆడితే ఏడాదికి రూ.58.2 కోట్ల చొప్పున ఇవ్వజూపినట్లు వెల్లడించాయి. దీనికి ప్లేయర్లు అంగీకరించలేదని తెలిపాయి. కాగా ఆస్ట్రేలియా జట్టు ఏడాదికి ఈ ప్లేయర్లకు చెరో రూ.8.74 కోట్లు చెల్లిస్తోంది. దీనికి దాదాపు 7 రెట్లు IPL ఫ్రాంచైజీ ఆఫర్ చేయడం గమనార్హం.
Comments