జుబీన్ గార్గ్ మృతి కేసులో DSP అరెస్టు
స్టార్ సింగర్ జుబీన్ గార్గ్ మృతి కేసులో DSP సందీపన్ గార్గ్‌ను SIT అరెస్టు చేసింది. జుబీన్ కజిన్ అయిన సందీపన్ టీమ్‌తో పాటు సింగపూర్ వెళ్లారు. ప్రదర్శనివ్వడానికి వెళ్లిన జుబీన్ స్కూబా డైవింగ్‌లో మరణించారు. తన భర్త మృతిలో కుట్ర ఉందని జుబీన్ భార్య గరిమ అనుమానం వ్యక్తం చేయగా అస్సాం ప్రభుత్వం సిట్‌తో విచారిస్తోంది. కేసులో ఇప్పటికే నలుగురు అరెస్టయ్యారు. వీరిపై హత్య, హత్యకు కుట్ర వంటి అభియోగాలు మోపారు.
Comments