టీటీడీ చైర్మన్‌పై అభ్యంతరకర పోస్ట్
తిరుమల : టీటీడీ చైర్మన్, సిబ్బందిని తప్పుడుబడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మహ్మద్ రఫీక్ అనే వ్యక్తిపై తిరుమల వన్‌టౌన్ పోలీస్టేషన్లో కేసు నమోదయింది. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఓ యువతి చేసిన రీల్స్‌ను రఫీక్ తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేస్తూ ‘ఇది బీఆర్ నాయుడు బాగోతం.. టీటీడీలో చాలా అభ్యంతరకర ప్రవర్తన.. భూమన షాకింగ్ నిజాలు’ అని పేర్కొన్నారు. దీనిపై టీటీడీ విజిలెన్స్ విభాగం ఏవీఎస్వో వెంకట నగేష్ బాబు బుధవారం తిరుమల వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా ప్రజల్లో అపోహలు, ద్వేషం రేకెత్తించే ప్రయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వన్‌టౌన్ పోలీసు లు బుఽధవారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments