నెలాఖరులో షార్ నుంచి మరో ప్రయోగం
సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సన్నాహం చేస్తోంది. సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ నెలాఖరులో ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్ ద్వారా కమ్యూనికేషన్ రంగానికి చెందిన జీశాట్-7ఆర్ (సీఎంఎస్3) ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనున్నారు. షార్‌లోని రెండో ప్రయోగ వద్ద రాకెట్ అనుసంధాన పనులను శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. ఈ రాకెట్ ద్వారా మొదట అమెరికాకు చెందిన బ్లూబర్డు ఉపగ్రహాన్ని పంపాల్సి ఉంది. అయితే చిన్నపాటి సమస్య తలెత్తి ఆ ప్రయోగం ఆలస్యం కావడంతో జీశాట్-7ఆర్‌ను పంపేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.
Comments