ప్లీజ్ సేవ్ గర్ల్ చైల్డ్
అంతర్జాతీయ బాలికా సంరక్షణ దినోత్సవం (ఈ నెల 11న) సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన దేవిన సోహిత, ధన్యత (దేవిన సిస్టర్స్) శుక్రవారం ‘ప్లీజ్ సేవ్ గర్ల్ చైల్డ్’.. మాపై అకృత్యాలకు అంతం లేదా? అన్న నినాదాలతో సైకత శిల్పం రూపొందించారు. భయంతో ముడుచుకుపోయిన బాలికను అబార్షన్లు, అత్యాచారాలు, లింగవివక్ష, బాల్య వివాహాలు చుట్టుముట్టినట్టు రూపొందించిన ఈ సైకత శిల్పం చూపరులను ఆలోచింపజేస్తోంది.
Comments