రేపు రైతులతో ప్రధాని మోదీ వర్చువల్ భేటీ
అమరావతి : కేంద్రం అమలు చేస్తున్న వ్యవసాయ, రైతు సంక్షేమ పథకాలు, ఇతర కార్యక్రమాలపై ప్రధాని మోదీ ఈ నెల 11న దేశవ్యాప్తంగా కొందరు రైతులతో వర్చువల్‌గా మాట్లాడనున్నారు. ఇందుకు రాష్ట్రంలోని అన్ని ఈనామ్ మార్కెట్ యార్డులు, మండీల్లో ప్రధాని సందేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి స్ర్కీన్లు ఏర్పాట్లు చేస్తున్నారు. వెబ్‌కాస్ట్, లైవ్ స్ర్టీమింగ్ ద్వారా స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, ఇతర వ్యవసాయరంగ వాటాదారులను భాగస్వామ్యం చేయాలని పీఎంవో రాష్ట్ర మార్కెటింగ్‌శాఖను ఆదేశించింది.
Comments