రాష్ట్ర ఆయుష్ శాఖకు రూ.166 కోట్లు విడుదల: మంత్రి సత్యకుమార్
ఆంధ్ర ప్రదేశ్ : రాష్ట్రంలో కొత్తగా ఆయుష్ శాఖకు చెందిన 5 ఆస్పత్రులు, 3 కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. రాష్ట్ర ఆయుష్ శాఖ అభివృద్ధికి కేంద్రం రూ.166 కోట్లు మంజూరు చేసిందని వివరించారు. ధర్మవరం, కాకినాడకు కొత్తగా ఆయుర్వేద కాలేజీలు మంజూరు చేసినట్లు వివరించారు. ఆయుష్ వ్యవస్థని మరింత పటిష్ఠ పరిచేలా బోధనా, బోధనేతర సిబ్బంది కోసం 500 పోస్టుల నియామకాలు చేపట్టబోతున్నామని ఆయన పేర్కొన్నారు.
Comments