• Oct 10, 2025
  • NPN Log

    కింగ్ నాగార్జున.. లాటరీ కింగ్ గా మారాడా.. ? అంటే నిజమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. అదేంటి సడెన్ గా కింగ్ కు ముందు లాటరీ.. ఏదైనా కొత్త లాటరీ కొట్టాడా.. ? అని కన్ఫ్యూజ్ అవ్వకండి. నాగ్ నటిస్తున్న 100 వ సినిమా టైటిల్ లాటరీ కింగ్ అని తెలుస్తోంది. అక్కినేని నాగార్జున ఈ ఏడాది తనలోని కొత్త టాలెంట్ ను బయటపెట్టాడు. హీరోగా కాకుండా సపోర్టివ్ రోల్ లో కుబేరలో కనిపించాడు. విలన్ గా కూలీలో కనిపించాడు. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడం పక్కన పెడితే.. నాగ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

    ఇక ఆ పాత్రలు చేశాడు కదా.. వాటికే అంకితమవుతాడు అనుకొంటే పొరపాటే. అవి చేస్తూనే ఇంకోపక్క హీరోగా తన సత్తా చూపించడానికి సిద్దమయ్యాడు. నాగ్ 100 వ సినిమాపై టాలీవుడ్ మొత్తం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఏ స్టార్ డైరెక్టర్ ను రంగంలోకి దింపుతాడా అనుకుంటే తమిళ్ డైరెక్టర్ రా కార్తీక్ ను ఫైనల్ చేసి షాక్ ఇచ్చాడు. సరే ఎవరైతే ఏమైంది సినిమా మాత్రం హిట్ అయితే చాలు అనుకుంటున్నారు అక్కినేని అభిమానులు. ఇక ఈ సినిమాకు లాటరీ కింగ్ అనే టైటిల్ ను ఫైనల్ చేశారని వార్తలు గుప్పుమంటున్నాయి.

    అక్కినేని నాగార్జునకు ఆల్రెడీ కింగ్ అనే బిరుదు ఉంది. ఇక ఈ లాటరీ చుట్టూనే కథ నడుస్తుందని లాటరీ కింగ్ అనే టైటిల్ అయితే బాగా యాప్ట్ అవుతుందని అదే టైటిల్ ను ఫైనల్ చేశారని టాక్ నడుస్తోంది. ఇక ఈ చిత్రంలో నాగ్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారని అంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమా కోసం నాగ్ లుక్ మొత్తం చేంజ్ చేస్తున్నాడట. ప్రతి సినిమాకు తన లుక్ ను మారుస్తూ అభిమానులను అలరిస్తున్నాడు నాగ్. మరి ఈ సినిమా కోసం ఎలాంటి లుక్ తో వస్తాడో.. ఎలా అభిమానులను అలరిస్తాడో చూడాలి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement