8మందినిందితుల #అరెస్ట్. #CMRF #చెక్కుల #స్కాంఛేదించిన సూర్యాపేట జిల్లా #మెల్లచేరువు పోలీస్. #నకిలీ #లబ్ధిదారులను సృష్టించి వారి బ్యాంక్ ఖాతాలోకి చెక్కు బదిలీ చేసి మోసానికి పాల్పడ్డ నిందితులు.
నిజమైన లబ్ధిదారులకు #అండగా నిలిచిన జిల్లా పోలీస్
హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో గతంలో మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అభ్యర్థన మేరకు లబ్ధిదారులకు వచ్చిన #CMRF ముఖ్యమంత్రి సహాయనిధి కి చెందిన చెక్కులను బాధితులకు ఇవ్వకుండా నకిలీ లబ్ధిదారుల అకౌంట్లో వేసి స్కాంకు పాల్పడిన 8 మంది నిందితులను మేళ్లచెరువు పోలీసులు అరెస్టు చేయడం జరిగినది. వారి నుండి 7.30 లక్షల నగదు, లబ్ధిదారులకు ఇవ్వని 44 చెక్కులు, 6 బ్యాంక్ ఫాస్ బుక్కులు స్వాధీనం చేసుకోవడం జరిగినది.
ఈ కేసులో ప్రధానంగా నేరేడుచర్ల మండలం సోమవారం గ్రామానికి చెందిన 34 సం. రాల పెండెం వెంకటేశ్వర్లు హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే కార్యాలయం నందు కంప్యూటర్ ఆపరేటర్ గా ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు ఇతనికి దగ్గర బంధువైన బెల్లంకొండ వెంకటేశ్వర్లు వాటర్ ప్లాంట్ నందు పనిచేస్తూ ఉంటాడు ఇతను ప్రధాన నిందితుడు పెండెం వెంకటేశ్వర్లుకు నకిలీ లబ్ధిదారులను సమకూర్చడం జరిగినది, ఇందులో ప్రధానంగా లబ్ధిదారి పేరు మీద వచ్చిన చెక్కులు ఇంటిపేర్లు ఉన్న మొదటి అక్షరంతో సరిపోలే పేరున్న నకిలీ లబ్ధిదారులను సృష్టించి వారి ఖాతాలో చెక్కుని బదిలీ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు అని ఎస్పీ తెలిపారు. నకిలీ వ్యక్తులను సృష్టించి వారికి డబ్బు ఆశ చూపి వచ్చిన మొత్తంలో కొంత వారికి కమిషన్ గా ఇచ్చి స్కాం కు పాల్పడ్డారు. అలాగే మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి గారి కార్యాలయంలో పనిచేసిన అసిస్టెంట్ గా ఉన్న ప్రైవేట్ వ్యక్తి పులిదిండి ఓంకార్ అనే వ్యక్తి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చే చెక్కులకు పూర్తి బాధ్యునిగా ఉన్నాడు. ఈ కేసుని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి అసలైన లబ్ధిదారులకు చెక్కులు చేరకుండా నకిలీ లబ్ధిదారులను సృష్టించి వారి అకౌంట్లోకి నగదు వేసుకొని మోసం చేస్తున్నారు ఈ విధంగా ఈ ముఠా ఏడూ చెక్కులను నకిలీ వ్యక్తుల అకౌంట్లో వేసి సుమారు 9 లక్షల 50 వేల రూపాయలు డ్రా చేయడం జరిగినది, కేసు దర్యాప్తు జరుగుతుండగా నకిలీ బాధితులు భయపడి అసలైన బాధితునికి ఇందులో 2 లక్షల 25 వేల రూపాయలు ఇవ్వడం జరిగినది. 7 లక్షల 30 వేల రూపాయలు నకిలీ బాధితుల నుండి స్కాంకు పాల్పడిన వ్యక్తుల నుండి స్వాధీనం చేసుకోవడం జరిగినది. అలాగే ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైనటువంటి లబ్ధిదారులకు చేరకుండా ఉన్నటువంటి మరో 44 చెక్కులను గుర్తించి సీజ్ చేయడం జరిగినది. 8 మందిని అరెస్టు చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా ఎమ్మెల్యే కార్యాలయంలో పనిచేసే డాటా ఎంట్రీ ఆపరేటర్ పెండెం వెంకటేశ్వర్లు ఇతనికి సమీప బంధువైన బెల్లంకొండ వెంకటేశ్వర్లు మరియు అసిస్టెంట్ గా పని చేస్తున్న ప్రైవేటు వ్యక్తి పులిదండి ఓంకారం, మాదాసు వెంకటేశ్వర్లు నిందితునికి దగ్గర బంధువు ఆతను నకిలీ లబ్ధిదారులుగా ఉండి కొంత లబ్ధి పొందాడు, మఠంపల్లి సైదులు వంటిముక్కల వెంకటేశ్వర్లు వీరిద్దరు కూడా నకిలీ లబ్ధిదారునిగా ఉండి కొంత డబ్బు లబ్ధి పొందారు, బెల్లంకొండ సైదులు మరొక మహిళ పద్మ వీరి కూడా నకిలీ లబ్ధిదారులుగా ఉండి వారి అకౌంట్లోకి డబ్బులు బదిలీ చేసుకొని కొంత డబ్బు లబ్ధి పొందారు.
Comments