ఆ స్కూళ్లల్లో 40లోపే విద్యార్థులు.. త్వరలో టీచర్ల సర్దుబాటు!
ఆంధ్రప్రదేశ్ : విద్యార్థుల సంఖ్య 40లోపు ఉన్న ఎయిడెడ్ స్కూళ్లు రాష్ట్రంలో 251 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అత్యధికంగా ప్రకాశంలో 35, గుంటూరులో 29, బాపట్ల 26, కడప 18 స్కూళ్లు, అత్యల్పంగా అనకాపల్లి, కర్నూలులో 2 చొప్పున ఉన్నాయి. ఈ స్కూళ్లకు నోటీసులు జారీ చేయాలని అధికారులను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశించారు. ఈ పాఠశాలల్లో పని చేసే మిగులు ఉపాధ్యాయులను ఇతర స్కూళ్లలో సర్దుబాటు చేయనున్నారు.
Comments