ఇంద్రకీలాద్రి ఆలయానికి రూ.10.30కోట్ల ఆదాయం
ఆంధ్ర ప్రదేశ్ : విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయానికి దసరా నవరాత్రుల సందర్భంగా వచ్చిన హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. 11 రోజుల్లో రూ.10.30 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. గత ఏడాది రూ.9.32 కోట్లు రాగా, ఈసారి రూ.కోటి పెరిగింది. అంతే కాకుండా 387 గ్రాముల బంగారం, 19 కేజీల 450 గ్రాముల వెండిని భక్తులు అమ్మవారికి హుండీ కానుకగా సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.
Comments