ఐవీఎఫ్ పద్ధతిలో కోడెదూడ జననం
మచిలీపట్నం : ఇన్ వి ట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీ ఎఫ్) పద్ధతిలో పశుసంవర్థక శాఖ అధికారులు కృష్ణా జిల్లాలో తొలిసారిగా చేసిన ప్రయోగం ఫలించింది. ప్రయోగశాలలో ఫలదీకరణం చేయించిన పిండాన్ని దేశీయ ఆవు గర్భంలో ప్రవేశపెట్టగా.. ఆ పిండం పెద్దదై తొమ్మిది నెలల ఐదు రోజులకు కోడెదూడ రూపంలో జన్మించింది. గుంటూరు లాంఫాం ప్రిన్సిపల్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం.ముత్తారావు, పశుగణాభివృద్ధి విభాగ వైద్యుడు శ్రీమన్నారాయణ, ఎన్‌ఆర్ శ్రీకాంత్, పశుసంవర్థక శాఖ ఏడీ నాగభూషణం, మొవ్వ మండలం భట్లపెనుమర్రు పశువైద్యాధికారి బి.విజయకుమార్ ఆధ్వర్యంలో ఈ ఐవీఎఫ్ పద్ధతికి శ్రీకారం చుట్టారు. గుంటూరు లాంఫాంలో మేలురకానికి చెందిన గిర్ జాతి ఆవు నుంచి అండాలు, ఒంగోలు జాతి ఆబోతు నుంచి వీర్యాన్ని సేకరించి ఫలదీకరణం చెందించారు. ఈ పిండాన్ని కృష్ణా జిల్లా మొవ్వ మండలం చినముత్తేవి గ్రామంలోని జొన్నలగడ్డ హనుమకుమార్‌కు చెందిన ఆవు ఎదకు వచ్చిన ఏడో రోజున గర్భంలో ప్రవేశపెట్టారు. ఈ పిండం పెరిగి పెద్దదవడంతో ఈ ఆవు సోమవారం కోడెదూడకు జన్మనిచ్చింది. మామూలు పద్ధతిలో ఒక ఆవు తన జీవితకాలంలో 8 నుంచి 10 పిల్లలకు జన్మనిస్తుందని, అయితే జన్యుపరమైన పద్ధతి ద్వారా ఒక ఆవు నుంచి సేకరించిన అండాలను 150 పిండాలుగా జన్యుమార్పిడి చేసి, వాటిని ఇతర ఆవుల గర్భంలో ప్రవేశపెట్టి 50 నుంచి 60 దూడలను పొందవచ్చని పశుసంవర్థకశాఖ ఏడీ నాగభూషణం, భట్లపెనుమర్రు పశువైద్యాధికారి విజయకుమార్ తెలిపారు. ఇలా పుట్టిన ఆవుల్లో పాల ఉత్పత్తి పెరుగుతుందన్నారు. ఐవీఎఫ్ రాష్ర్టీయ గోకుల్ మిషన్‌లో భాగంగా దేశీయ ఆవు జాతులను మరింతగా ఉత్పత్తి చేసేందుకు ఈ ప్రయోగం చేసి సఫలీకృతులమైనట్లు పేర్కొన్నారు. ఐవీఎఫ్ పద్ధతిలో ఆవు దూడలు మాత్రమే పుట్టేలా చేస్తున్న ప్రయోగాలు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. కృష్ణా జిల్లాలో తొలిసారిగా చేపట్టిన
Comments