కనిగిరి: విజయవాడకు తరలిన టీచర్లు
సీపీఎస్ రద్దు, ఆర్థిక విద్యారంగ పరిరక్షణ కోసం ఫ్యాప్టో తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి కనిగిరి నియోజకవర్గం నుంచి యూటిఎఫ్ టీచర్లు మంగళవారం భారీగా తరలి వెళ్లారు. యూటీఎఫ్ నాయకుడు ముక్కు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు సీపీఎస్ రద్దు గురించి ఆలోచించకపోవడం బాధాకరమన్నారు. ఉద్యోగుల జీతాల పెంపునకు పీఆర్సీ కమిషన్ నియమించాలని డిమాండ్ చేశారు.
Comments