కరూర్ తొక్కిసలాటపై రిషబ్ శెట్టి ఏమన్నారంటే?
తమిళనాడులో హీరో విజయ్ ర్యాలీలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి అన్నారు. ఇది అనుకోకుండా జరిగిన ఘటనగా పేర్కొన్నారు. ఇది ఒక్కరి తప్పు కాదని సమష్టి పొరపాటుగా భావిస్తున్నానని అభిప్రాయపడ్డారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందని పేర్కొన్నారు. పోలీసులు, ప్రభుత్వంపై నింద వేయడం సులభమేనని, అంత జనం ఉన్నప్పుడు వారిని నియంత్రించడం సమస్యేనని పేర్కొన్నారు.
Comments