గంటల కొద్దీ ఒకే అంశం ప్రస్తావించొద్దు: హైకోర్టు
తెలంగాణ : స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఇదే చివరి విచారణ కాదు, అన్ని అంశాలు ప్రస్తావించొద్దు. గంటల కొద్దీ ఒకే అంశం ప్రస్తావించి సమయం వృథా చేయొద్దు’ అని పిటిషనర్లకు సూచించింది. ప్రభుత్వం తరఫున అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. ‘రిజర్వేషన్ల గరిష్ఠ పరిమితి 50% మించరాదని రాజ్యాంగంలో లేదు. ప్రజల అవసరాలను బట్టి వాటిని పెంచుకొనే అవకాశం ప్రభుత్వానికి ఉంది’ అని అన్నారు.
Comments