డీఎంహెచ్‌వోపై వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఆగ్రహం
గుంటూరు : గుంటూరు నగర సమీపంలోని తురకపాలెంలో ఆదివారం జరిగిన చల్లా కృష్ణవేణి మృతి ఘటనపై వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తురకపాలెం బీసీ కాలనీకి చెందిన కృష్ణవేణి గుంటూరు జీజీహెచ్‌లో ఆదివారం మెలియాయిడోసిస్ వ్యాధి లక్షణాలతో మృతి చెందారు. ఈ క్రమంలో వీరపాండియన్ గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, డీఎంహెచ్‌వో డాక్టర్ కె.విజయలక్ష్మీతో సోమవారం మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పది రోజులుగా రోగి ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నా ఎందుకు ఫాలో అప్‌లో లేరని ఆయన డీఎంహెచ్‌వోపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మరోసారి తురకపాలెంలో పరిస్థితిని సమీక్షించి నివేదిక అందజేయాలని కమిషనర్ ఆదేశించారు.
Comments