తెలుగు టైటాన్స్ ‘తగ్గేదేలే’.. వరుసగా ఐదో విజయం
ప్రో కబడ్డీ లీగ్ సీజన్-12లో తెలుగు టైటాన్స్ అదరగొడుతోంది. వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఈరోజు హరియాణా స్టీలర్స్‌తో మ్యాచులో 46-29 తేడాతో విక్టరీ సాధించింది. ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచుల్లో 8 గెలిచింది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో ఉంది. ఇవాళ్టి మ్యాచులో భరత్ 20, విజయ్ మాలిక్ 8 పాయింట్లు సాధించారు. పాయింట్ల పట్టికలో దబాంగ్ ఢిల్లీ, పుణెరి పల్టాన్ తొలి 2 స్థానాల్లో ఉన్నాయి.
Comments