• Oct 10, 2025
  • NPN Log

    అమరావతి : ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ‘దీపం-2’ పథకాల అమలు తీరును పర్యవేక్షించడానికి ప్రభుత్వం జిల్లాస్థాయి దీపం-ఉజ్వల కమిటీ(డీడీయూసీ)లను ఏర్పాటు చేసింది. కమిటీకి జిల్లా కలెక్టర్‌ (పౌరసరఫరాలు) లేదా ఆయన సూచించిన సీనియర్‌ అధికారి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ ఆ జిల్లాకు కేటాయించిన ప్రతినిధి మెంబరు కో-ఆర్డినేటర్‌గా ఉంటారు. ఇతర ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల (ఐవోసీఎల్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, మహారత్న ప్రభుత్వ రంగ సంస్థల)కు చెందిన అధికారులు, జిల్లా ఆహార,పౌరసరఫరాల అధికారి, అనధికారులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు పౌరసరఫరాల కమిషనర్‌, ప్రభుత్వ ఎక్స్‌-అఫిషియో సెక్రటరీ సౌరభ్‌గౌర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.


     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).