పాడిరైతులకు భరోసా- ఉచిత పశుగ్రాసం సాగు పథకం
ఆంధ్ర ప్రదేశ్: వ్యవసాయ భూమి ఉండి, పాడి పశువుల పోషణతో కుటుంబాలను పోషించుకుంటున్న చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం ఉచిత పశుగ్రాసం సాగు పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం కింద పశుగ్రాసం సాగు చేస్తే ఉపాధిహామీ పథకం కింద వందశాతం రాయితీ అందిస్తుంది. కనిష్ఠంగా 10 సెంట్లు, గరిష్ఠంగా 50 సెంట్ల వరకు పశుగ్రాసాన్నిపెంచుకోవచ్చు. గరిష్ఠంగా రూ.32,992, కనిష్ఠంగా రూ.6,559 ప్రభుత్వ సాయంగా అందుతుంది.
Comments