పత్తి రైతుకు మద్దతు దక్కుతుందా?
ఈ ఏడాది పత్తి పంట క్వింటాకు రూ.8,110 మద్దతు ధరగా నిర్ణయించారు. సీసీఐ నిబంధనలకు అనుగుణంగా పంటలో తేమ, నాణ్యత ఉంటేనే ఈ ధర వస్తుంది. పత్తిలో గరిష్ఠంగా 8-12% తేమనే CCI అనుమతిస్తోంది. అయితే కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలు, చీడపీడల వల్ల ఈసారి పత్తిలో తేమశాతం ఎక్కువగా ఉండటంతో పాటు నాణ్యత కూడా తగ్గే అవకాశం కనిపిస్తోంది. దీని వల్ల మద్దతు ధర దక్కుతుందో? లేదో? అనే ఆందోళన పత్తి రైతుల్లో నెలకొంది.
Comments