పరిశ్రమలకు ప్రోత్సాహకాలు విడుదల చేయాలి: ఏపీ చాంబర్స్
అమరావతి : రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహకాలను వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య(ఏపీ చాంబర్స్) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. నవంబరు 14, 15 తేదీల్లో విశాఖలో నిర్వహిస్తున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముందు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి ఈనెలాఖరులోగా పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహకాలను విడుదల చేయాలని ఏపీ చాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.
Comments