మిథాలీ పేరిట స్టాండ్
విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఒక స్టాండ్‌కు భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ పేరును, అలాగే స్టేడియంలోని ఓ గేటుకు మరో క్రికెటర్ రావి కల్పనల పేరు పెట్టనున్నారు. ఆదివారం ఇక్కడ భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే మహిళల వరల్డ్‌కప్ మ్యాచ్ సందర్భంగా వీటిని ఆవిష్కరించనున్నారు. ఇటీవలే ఓ చాట్ షోలో మహిళా క్రికెటర్లకు తగిన గుర్తింపు ఇవ్వాలని మంత్రి నారా లోకేష్‌కు స్మృతి మంధాన విజ్ఞప్తి చేసింది. తక్షణం స్పందించిన లోకేష్ స్టాండ్స్‌కు మహిళా క్రికెటర్ల పేర్లు పెట్టే ప్రతిపాదన చేయగా ఏసీఏ ఆమోదించింది.
Comments