మరిన్ని కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి కసరత్తు
తెలంగాణ : కొత్తగా మరిన్ని ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులకు అనుమతి రాగా నిజామాబాద్, మహబూబ్ నగర్, పెద్దపల్లి ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి AAI, IAF అప్రూవల్ కోసం ప్రయత్నిస్తోంది. అటు గతంలో సాయిల్ టెస్టులో ఫెయిలైన కొత్తగూడెం దగ్గర అనువైన భూమి వెతికే పనిలో ఉన్నట్లు అధికార వర్గాలు వే2న్యూస్‌కు తెలిపాయి.
Comments