మలయాళ సూపర్‌స్టార్‌కు అరుదైన గౌరవం
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నుంచి ఆయన COAS కమెండేషన్ కార్డ్ అందుకున్నారు. ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ మోహన్‌లాల్ ట్వీట్ చేశారు. ‘హానరరీ లెఫ్టినెంట్ కల్నల్ గుర్తింపు దక్కడం గర్వంగా ఉంది. ఆర్మీ చీఫ్, నా మాతృసంస్థైన టెరిటోరియల్ ఆర్మీకి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ఇటీవల ఆయన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.
Comments