రెండు సిరప్లపై ప్రభుత్వం నిషేధం
తెలంగాణ : రాష్ట్రంలో రెండు దగ్గు మందులను ప్రభుత్వం నిషేధించింది. Relife CF, Respifresh-TR సిరప్‌లను వాడొద్దని స్పష్టం చేసింది. ఈ రెండు దగ్గు సిరప్‌లలో అత్యంత విషపూరితమైన Diethylene Glycol (DEG) ఉందని పేర్కొంది. వీటి వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని తెలిపింది. కాగా మధ్యప్రదేశ్‌లో Coldrif సిరప్ వల్ల 20 మంది చిన్నారులు చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
Comments