వన్డే జట్టులో స్టార్క్
మెల్‌బోర్న్: భారత్‌తో జరిగే వన్డే, టీ20ల సిరీ్‌సల కోసం ఆస్ట్రేలియా జట్లను ప్రకటించారు. గత నెల టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన పేసర్ మిచెల్ స్టార్క్‌కు వన్డే జట్టులో చోటు దక్కింది. పని ఒత్తిడిలో భాగంగా అతడు ఆగస్టులో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీ్‌సకు దూరంగా ఉన్నాడు. గతేడాది నవంబరులో స్టార్క్ తన చివరి వన్డే ఆడడం గమనార్హం. ఈనెల 19 నుంచి భారత్‌తో మూడు వన్డేల సిరీస్ జరుగనుంది. ప్యాట్ కమిన్స్ గాయం నుంచి కోలుకోకపోవడంతో జట్టుకు మిచెల్ మార్ష్ నాయకత్వం వహించనున్నాడు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో మాథ్యూ రెన్‌షా, షార్ట్, మిచ్ ఓవెన్‌లకు కూడా చోటు దక్కింది. మరోవైపు ఈనెల 29 నుంచి జరిగే ఐదు టీ20ల సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లకు మాత్రమే జట్టును ప్రకటించారు.
వన్డే జట్టు: మార్ష్ (కెప్టెన్), బార్ట్‌లెట్, క్యారీ, కనోలీ, డ్వార్షుస్, ఎల్లిస్, గ్రీన్, హాజెల్‌వుడ్, హెడ్, ఇన్‌గ్లి్‌స, ఓవెన్, రెన్‌షా, షార్ట్, స్టార్క్, జంపా.
టీ20 జట్టు: మార్ష్ (కెప్టెన్), ఎబాట్, బార్ట్‌లెట్, డేవిడ్, డ్వార్షుస్, ఎల్లిస్, హాజెల్‌వుడ్, హెడ్, ఇన్‌గ్లిస్, కునేమన్, షార్ట్, ఓవెన్, స్టొయినిస్, జంపా.
Comments