సిరిమానోత్సవంలో తొక్కిసలాట
ఆంధ్ర ప్రదేశ్ : విజయనగరం సిరిమానోత్సవంలో తొక్కిసలాట జరిగింది. వేడుక జరుగుతున్న ప్రాంతానికి ఆర్డీవో కీర్తి కారులో రావడంతో గందరగోళం ఏర్పడింది. ఈక్రమంలోనే తోపులాట జరిగి తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో ఓ మహిళ గాయపడగా ఆసుపత్రికి తరలించారు. ఆర్డీవో కీర్తి తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments