హర్షిత్ సెలక్షన్ వెనక లాజిక్ ఏంటో: అశ్విన్
టీమ్ ఇండియాలోకి హర్షిత్ రాణాను తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తన యూట్యూబ్ ఛానల్‌లో అశ్విన్ స్పందించారు. ‘హర్షిత్ సెలక్షన్ వెనకున్న లాజిక్ ఏంటో తెలియదు. అతడిని ఎందుకు తీసుకున్నారో నాకూ తెలుసుకోవాలనుంది. ఆస్ట్రేలియా లో బ్యాటింగ్ కూడా చేయగలిగిన బౌలర్ అవసరం. హర్షిత్ బ్యాటింగ్ చేస్తాడని వాళ్లు భావించి ఉండొచ్చు. అతడు అర్హుడా అని నన్నడిగితే.. సందేహించాల్సిన విషయమే’ అని చెప్పారు.
Comments