గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలివే..
ప్రస్తుతకాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ హార్ట్‌అటాక్ వస్తోంది. అయితే మహిళలకు ఈ ప్రమాదం ఎక్కువంటున్నారు నిపుణులు. గుండెపోటు వచ్చే ముందు మహిళల్లో ఛాతీలో అసౌకర్యం, భుజాలు, వీపు, మెడ, దవడ ప్రాంతాల్లో నొప్పి, శ్వాస సరిగా ఆడకపోవడం, తలతిరగడం, చెమట ఎక్కువగాపట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
Comments