వణుకు పుట్టించేలా 'పంజరం' ట్రైలర్
అనిల్, యువతేజ, ముస్కాన్, రూప ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘పంజరం’ . సే స్టోరీ ప్రొడక్షన్స్, ఆర్3 ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఆర్ రఘన్ రెడ్డి నిర్మాతగా సాయి కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. పేదరాసి పెద్దమ్మ అంటూ ఓపెన్ చేసిన ట్రైలర్, ఊరుని చూపించిన తీరు, హారర్ ఎలిమెంట్స్ అన్నీ కూడా రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి.
దర్శకుడు సాయికృష్ణ మాట్లాడుతూ ‘మంచి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందిజ, మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. ఆర్‌ఆర్ ఆకట్టుకుంటుంది. ట్రైలర్ వెన్నులో వణుకు పుటించేలా ఉంది. సినిమా అంతకుమించి ఉంటుంది’ అని అన్నారు. హీరో యువతేజ మాట్లాడుతూ ఇందులో మల్లి అనే పాత్ర పోషించా. నా కారెక్టర్, లుక్స్ అన్నీ కొత్తగా ఉంటాయి’ అన్నారు.
Comments