ఏపీ ప్లాంట్ కోసం రూ.1,908 కోట్ల నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో నిర్మించనున్న 120 మెగావాట్ల సామర్థ్యం గల పునరుత్పాదక ఇంధన హైబ్రిడ్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వ రంగంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకుల నుంచి రూ.1,908 కోట్లు సమీకరించినట్టు హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ప్రకటించింది. విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్న వేళల్లో అందుకు అవసరమైన విద్యుత్‌ను అందించే ఈ ప్రాజెక్టును ఎస్‌జేవీఎన్‌కు కాంట్రాక్టు ఇచ్చారు. ఇది పవన, సౌర విద్యుత్ రెండింటినీ సమీకృతం చేస్తుంది. తిరిగి చెల్లించేందుకు 21 సంవత్సరాల కాలపరిమితి ఉన్న ఈ నిధుల సహాయంతో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి ప్రారంభించే వీలు కలుగుతుందని కంపెనీ తెలిపింది.
Comments