వెండి ధరకు రెక్కలు.. ఒక్కరోజే రూ.7వేలు హైక్
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కేజీ వెండి ధర ఇవాళ ఉదయం రూ.1,000, ఇప్పుడు మరో రూ.6వేలు పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.1,77,000కు చేరింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.9,900 పెరగడం గమనార్హం. ఫ్యూచర్‌లో వెండి ధర ఊహించని విధంగా పెరుగుతుందని ట్రేడ్ నిపుణులు చెబుతుండటంతో ఇన్వెస్టర్లు సిల్వర్‌పై మొగ్గుచూపుతున్నారు. దీంతో భారీగా ధరలు పెరుగుతున్నాయి. ఇలానే కొనసాగితే నెలాఖరుకి రూ.2లక్షలకు చేరే ఛాన్స్ ఉంది.
Comments