కొత్త డీమ్యాట్ ఖాతాల సంఖ్య 40% తగ్గుదల
భారత్‌లో కొత్త డీమ్యాట్ ఖాతాల సంఖ్య తగ్గింది. 2024లో మొదటి 9 నెలల్లో 3.61Cr ఖాతాలు తెరవగా, ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్య 2.18Cr అకౌంట్స్ యాడ్ అయ్యాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే దాదాపు 40% తగ్గింది. 2024లో సగటున నెలకు 40లక్షల అకౌంట్లు నమోదు కాగా, 2025లో సగటున 24 లక్షల ఖాతాలు మాత్రమే తెరుచుకున్నాయి. ఏడాది కాలంగా పెద్దగా రిటర్న్స్ రాకపోవడం, IPOల తగ్గుదల వంటివి ఇందుకు కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.
Comments