కల్తీ లిక్కరంటూ ఫేక్ ప్రచారాలు చేస్తే చర్యలు: సీఎం చంద్రబాబు
ఆంధ్ర ప్రదేశ్ : కల్తీ మద్యం అంటూ ఫేక్ ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ‘అన్నమయ్య జిల్లాలో జరిగిన కల్తీ లిక్కర్ ఘటనపై వైసీపీ రాజకీయ లబ్ధికోసం రాష్ట్రమంతా దుష్ప్రచారం చేస్తోంది. ప్రాణాలు పోతున్నాయని ప్రజల్ని భయపెడుతోంది. మంత్రులు వీటిని ఖండించాలి’ అని చెప్పారు. వివేకా హత్యలో ఆడిన డ్రామాలను మరిచిపోవద్దన్నారు. ఫేక్ ప్రచారంతో ఆ పార్టీ ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తోందని విమర్శించారు.
Comments