అంబటి, జగన్ పత్రిక, టీవీకి లీగల్ నోటీసులు
పొన్నూరు : తనపై అసత్య ప్రచారాలకు పాల్పడిన వైసీపీ పొన్నూరు ఇన్చార్జి అంబటి మురళీకృష్ణ, జగన్ పత్రిక, టీవీకి పొన్నూరు ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గురువారం లీగల్ నోటీసులు పంపారు. అమరావతి కోసం పొన్నూరును ముంచివేశారని, కొండవీటి వాగు నీరు అప్పాపురం, గుంటూరు చానల్ ద్వారా పొన్నూరుకు మళ్లించడం ద్వారా రూ.మూడు వేల కోట్లు దోచుకున్నారని అంబటి మురళీకృష్ణ ఆరోపించారని నోటీసులో పేర్కొన్నారు. అలాగే చేబ్రోలులోని కొమ్మమూరు కాలువ బ్రిడ్జి నిర్మాణ కాంట్రాక్టర్ నుంచి తాను రూ.5 కోట్ల కమీషన్ డిమాండ్ చేసినట్టు తప్పుడు ప్రచారం చేశారని నోటీసులో తెలిపారు. ఈ అసత్య ప్రచారాలకు క్షమాపణ చెప్పి రూ.5 కోట్ల పరిహారం కట్టాలని, లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ధూళిపాళ్ల స్పష్టం చేశారు.
Comments