తొక్కిసలాట ఘటన.. సుప్రీంకు విజయ్ పార్టీ
తమిళనాడులోని కరూర్లో జరిగిన తొక్కిసలాటపై సిట్ దర్యాప్తును సవాల్ చేస్తూ సినీ హీరో విజయ్ పార్టీ టీవీకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. సీనియర్ అధికారి అస్రా గార్గ్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని పేర్కొంది. గత నెల 27న జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన సంగతి తెలిసిందే.
Comments