ఆ లక్ష్య సాధనకు టీచర్ల సహకారం అవసరం: లోకేశ్
ఆంధ్ర ప్రదేశ్ : టీచర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. మ్యూచువల్, స్పౌజ్ బదిలీలతో పాటు భాషా పండితులకు పదోన్నతులు దక్కిన నేపథ్యంలో ఆయన్ను పలువురు టీచర్లు కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘విద్యాశాఖలో తొలి ఏడాది సంస్కరణలు పూర్తి చేశాం. వచ్చే నాలుగేళ్ల పాటు ఫలితాలపైనే దృష్టిసారిస్తాం. విద్యావ్యవస్థను నం.1గా తీర్చిదిద్దాలనేదే లక్ష్యం. ఇందుకు టీచర్ల సహకారం కావాలి’ అని అన్నారు.
Comments