ఆంక్షలతో జగన్ పర్యటనకు అనుమతి
ఆంధ్ర ప్రదేశ్ : అనకాపల్లిలో రేపు వైసీపీ చీఫ్ జగన్ పర్యటనకు ఆంక్షలతో కూడిన అనుమతి లభించింది. ఈ విషయాన్ని విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత వెల్లడించారు. వైజాగ్ ఎయిర్‌పోర్టు నుంచి ఎన్ఏడీ కొత్త రోడ్, వేపగుంట, సరిపల్లి జంక్షన్ మీదుగా రోడ్డు మార్గంలో రావాలని సూచించారు. ట్రాఫిక్ ఏసీపీ పర్మిషన్ లేకుండా ఎలాంటి మార్పులు, హాల్ట్ చేయకూడదని పేర్కొన్నారు. జన సమీకరణకు అనుమతి లేదని, ఊరేగింపులు, రోడ్ మార్చ్‌లపై నిషేధం ఉందన్నారు.
Comments