ఉచిత పథకాలతో అభివృద్ధికి ఆటంకం: వెంకయ్య నాయుడు
రాష్ట్రప్రభుత్వాలు ఉచిత పథకాల కంటే అభివృద్ధిపై దృష్టి సారించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. ఎన్నికల్లో ప్రయోజనాల కోసం ఉచితాలు ప్రకటించడం అలవాటుగా మారిందని, దీని వల్ల అప్పులు పెరిగి అభివృద్ధి కుంటుపడుతోందని విలేకర్లతో తెలిపారు. దీర్ఘకాలిక ప్రాజెక్టుల (సాగునీటి, విద్యుత్) నిర్మాణం కోసం అప్పులు చేస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. ప్రభుత్వాలు విద్య, వైద్యంపై దృష్టి సారించాలని హితవు పలికారు.
Comments