కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా ఆదుకుంటాం: లోకేశ్
ఆంధ్ర ప్రదేశ్ : టీడీపీ కార్యకర్తలంతా తన కుటుంబ సభ్యులని, వారికి ఏ కష్టమొచ్చినా ఆదుకోవడం తన బాధ్యత అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అనుచరుల దాడిలో గాయపడి, అస్వస్థతతో ఇటీవల మరణించిన శేషగిరిరావు కుటుంబ సభ్యులను ఉండవల్లికి రప్పించి మాట్లాడారు. ఈవీఎం ధ్వంసం ఘటనలో ఆయన గట్టిగా పోరాడారని, స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. ఇలాగే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని అన్నారు.
Comments