నేడు క్యాబినెట్ సమావేశం
అమరావతి : రాష్ట్ర మంత్రి మండలి సమావేశం శుక్రవారం జరగనుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి క్యాబినెట్‌లో ఆమోదం తెలపనున్నారు. రూ.87,520 కోట్లతో విశాఖలో ఏర్పాటు చేయనున్న రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్‌కు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. రాజధాని అమరావతిలో నిర్మించనున్న రాజ్‌భవన్ నిర్మాణానికి, నాలుగు కన్వెన్షన్ సెంటర్లకు క్యాబినెట్‌లో ఆమోదం తెలుపుతారు.
Comments