నాపై అటాక్ డ్రామా అన్నారు: సైఫ్
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ తనపై ఈ ఏడాది జనవరి లో దుండగుడు దాడి చేసిన ఘటనపై స్పందించారు. ‘డిశ్చార్జ్ అయ్యాక ఆస్పత్రి నుంచి నడుస్తూ వచ్చి కార్ ఎక్కడం చర్చనీయాంశమైంది. అంబులెన్సో, వీల్‌ఛైర్‌లో వస్తే తీవ్ర గాయాలయ్యాయని అందరూ ఆందోళన చెందుతారని నొప్పిగా ఉన్నా అలాగే వచ్చా. కానీ దాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుని నాపై దాడే జరగలేదని, అదంతా డ్రామా అన్నారు. ఇలాంటి సమాజంలో జీవిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు.
Comments