మెర్సిడెస్ బెంజ్.. రోజుకు 277 కార్ల అమ్మకం
GSTతో భారీగా ధరలు తగ్గడం, నవరాత్రుల సందర్భంగా మెర్సిడెస్ బెంజ్ కార్లు రికార్డుస్థాయిలో అమ్ముడయ్యాయి. నవరాత్రుల్లో (9 రోజుల్లో) ఏకంగా 2,500 కార్లను విక్రయించినట్లు ఆ కంపెనీ ప్రకటించింది. సగటున రోజుకు 277 కార్లు అమ్ముడయ్యాయని, ఒక్కో కారు సగటు ధర రూ.కోటి అని తెలిపింది. ఈ ఏడాది జులై-సెప్టెంబర్ క్వార్టర్‌లో 5,119 కార్లను విక్రయించినట్లు పేర్కొంది. కాగా జీఎస్టీ తగ్గింపుతో కార్ల ధరలు 6% వరకు తగ్గాయి.
Comments