వెండి ధర ఏడాదిలో 400% పెరగొచ్చు: రాబర్ట్
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రైటర్ రాబర్ట్ కియోసాకి వెండి ధరలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం వెండి చౌకగానే ఉంది. గత 12నెలల్లో వెండి ధర 45% మాత్రమే పెరిగింది. మున్ముందు 400% పెరగొచ్చు. వెండిపై పెట్టే $100 ఏడాదిలో $500 అవ్వొచ్చు’ అని అంచనా వేశారు. దీంతో వెండి ధర KGకి రూ.5లక్షలు దాటనుందనే చర్చ మొదలైంది. కాగా అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితులతో ఇన్వెస్టర్స్ బంగారం, వెండి వైపు మొగ్గుచూపుతున్నారు.
Comments