కోల్డ్రిఫ్ సిరప్‌కు 20 మంది పిల్లలు బలి!
మధ్యప్రదేశ్‌లో కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ మరణాల సంఖ్య 20కి చేరినట్లు డిప్యూటీ సీఎం రాజేంద్ర శుక్ల వెల్లడించారు. నాగ్‌పూర్‌లో ఆస్పత్రులను ఆయన సందర్శించారు. కలుషిత సిరప్ తాగి మరో ఐదుగురి కిడ్నీలు పాడైపోయాయని, ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మృతుల్లో చింద్వారాకు చెందిన వారే 17 మంది ఉన్నారని చెప్పారు. ఫీవర్, జలుబు ఉన్న పిల్లలు సిరప్ తాగడంతో వాంతులు, మూత్ర విసర్జన సమస్యలు వంటి లక్షణాలు కనిపించాయన్నారు.
Comments