మహిళల కోసం ‘సఖి సురక్ష’.. రేపే ప్రారంభం
ఆంధ్ర ప్రదేశ్ : పట్టణ మహిళా సంఘాల సభ్యుల కోసం మెప్మా ‘సఖి సురక్ష’ కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. ‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్’లో భాగంగా రేపు వైజాగ్‌లో దీనిని ప్రారంభించనుంది. ఇందులో భాగంగా 74 మున్సిపాలిటీల్లో 35 ఏళ్లు పైబడిన మహిళలకు హెల్త్ టెస్టులు చేయనున్నారు. అలాగే మహిళా సంఘాల కుటుంబాల్లోని నిరుద్యోగుల కోసం జాబ్ మేళాలు నిర్వహిస్తారు. ఈరోజు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌లో 20 కంపెనీలతో జాబ్ మేళా నిర్వహించనున్నారు.
Comments