సకల సుఖాలకు మూలమేంటో తెలుసా?
అధముడు భయంతో ఏ పనీ మొదలుపెట్టడు. మధ్యముడు ఆటంకాల వల్ల మధ్యలోనే ఆగిపోతాడు. ఉత్తముడు మాత్రమే ధైర్యాన్ని ప్రధానంగా ఎంచుకుని, సాధనను ఆపకుండా కొనసాగిస్తాడు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను దైవంపై విశ్వాసంతో ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతాడు. అటువంటి సాహసవంతుడినే లక్ష్మిదేవి (శ్రేయస్సు, ఆనందం) వరిస్తుంది. అందుకే మన ఆధ్యాత్మిక ధర్మం ‘ధైర్యే సాహసే లక్ష్మి’ అని ఉపదేశించింది. ఆ ఆత్మధైర్యమే సకల సుఖాలకు మూలం.
Comments